జనసేన పార్టీలో కొత్తగా చేరిన మిథున్ షాలి కి మండల నాయకులు ఘనంగా స్వాగతం………..
అందరి కృషితోనే పార్టీ అభివృద్ధి సాధ్యం………..
మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు, పట్టణ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి వెల్లడి
రేణిగుంట జూన్ 7.గ్రామీణ స్థాయి నుండి జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యమని రేణిగుంట మండల జనసేన పార్టీ అధ్యక్షులు చిన్నతోటి నాగరాజు స్పష్టం చేశారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు మండల పార్టీ సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల జనసేన పార్టీలో కొత్తగా చేరిన స్వర్గీయ డాక్టర్ బషీర్ గారి కుమారుడు మిధున్ శాలిని ఘనంగా స్వాగతం పలికి రేణిగుంట మండల, పట్టణ అధ్యక్షులు శాలువాతో ఘనంగా సన్మానించారు. జనసేన పార్టీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు. మండలంలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించి నాయకులు మాట్లాడారు. జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే పదవులు అవే వస్తాయని ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.మండలంలో పార్టీ మరింత బలోపేతం చేయటానికి అందరి సలహాలు సూచనలు తీసుకున్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు చిన్నతోటి నాగరాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల భాగ్యలక్ష్మి, మండల ఐటి-కో ఆర్డినేటర్ దీన దయాల్, పట్టణ ఉపాధ్యక్షులు పార్థ సారథి, మండల ప్రధాన కార్యదర్శి తోట ముకేశ్ ,కార్యదర్శులు గోవర్ధన్ ఆకుల తిలక్ ,మణికంఠ ,మునిశంకర్ ,సీనియర్ నాయకులు త్యాగరాజులు ,మిథున్ షాలి, వీర మహిళా అనురాధ, సతీష్ , రమేష్ రెడ్డి , మునికృష్ణ ,కోబాకు పాండు ,సలీం, బసవపున్నయ్య, శీను ,మెగా ఫ్యామిలీ మోహన్ ,కుమార్ కలిశెట్టి, జనసైనికులు మరియు వీరామహిళలు పాల్గొన్నారు.


