పచ్చదనం పెంపునకు విశేష కృషి: తుడా చైర్మన్ డా||డాలర్స్ దివాకర్ రెడ్డి

​పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, జేసీ ఆర్ గోవింద రావు.. రేణిగుంట జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు తుకివాకం పద్మావతి నగర్ లేఔట్ ఆర్చ్ వద్ద బృహత్తర వృక్షారోపణ (మొక్కలు నాటే) కార్యక్రమం ఉత్సాహంగా జరిగిందఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ,తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి , మరియు తుడా వైస్ చైర్మన్ ఆర్. గోవింద రావు విచ్చేసి,స్వయంగా మొక్కలు నాటి పర్యావరణ స్పృహను చాటారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు,ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత.నాటిన ప్రతి మొక్కను వృక్షంగా మారేలా పెంచాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.పెరుగుతున్న భూతాపాన్ని, కాలుష్యాన్ని అరికట్టడానికి చెట్లే మనకున్న ప్రధాన ఆయుధమన్నారు.

పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ద్వారానే మానవ మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు.భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి పౌరుడూ విధిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలన్నారు.తిరుపతి మరియు పరిసర ప్రాంతాలను పచ్చలహారంగా, సుందరంగా మార్చేందుకు తుడా నిరంతరం కృషి చేస్తోంది అని అన్నారు.

పర్యావరణ దినోత్సవం స్ఫూర్తితో పద్మావతి నగర్ లేఔట్ తో పాటు తుడా పరిధిలోని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పచ్చదనం పెంపు ఎంతో ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడానికి విరివిగా మొక్కలు నాటడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.ప్రతి ఒక్కరూ ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడంతో పాటు, అవి పెద్ద వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.తుడా వైస్ చైర్మన్ ఆర్. గోవింద రావు మాట్లాడుతూ, ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.తుడా పరిధిలోని ప్రతి కొత్త లేఔట్ లోనూ గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధే తమ లక్ష్యమని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ సి సి 29వ బెటాలియన్ తిరుపతి విద్యార్థులు, ఎంబీయూ విద్యార్థులు, పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో రేణిగుంట ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి,తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు ఎస్ ఈ రవీంద్రయ్య సీపిఓ దేవికుమారి, ఆర్టికల్చర్ అధికారి మాలతి, ఏపీఓ లు, జెపిఓలు, తుడా ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్, ఆర్టికల్చర్ అధికారులు,తుడా సిబ్బంది మండల కూటమి నాయకులు తదితరులు పాలొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *