తవణంపల్లి జూన్ 04 మన ద్యాస

జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు కార్యక్రమంలో బాగంగా తవనంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఆటోలకు స్టికర్ లు పంపిణి చేసి అంటించిన ఎస్ ఐ జి . రమేష్ జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీస్ ఆదేశాల మేరకు ప్రజల భద్రత, మహిళల రక్షణ, నేరాల నివారణ మరియు ప్రజలకు సురక్షితమైన వ్యవస్థను అందించేందుకు, ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలను పెంపొందిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజల్లో భద్రతాభావం మరియు పోలీసు శాఖపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు వేయాలని ఆదేశించారు .ఈ కార్యక్రమంలో బాగంగా తవణంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయినా రమేష్ తవనం పల్లి మండలంలోని అన్ని ఆటోలకు స్టికర్ లను అంటించడం జరిగింది.ఎస్సై మాట్లాడుతూ… మండలంలోని ఆటోరిక్షాలకు ప్రత్యేక పోలీసు గుర్తింపు సంఖ్య (యూనిక్యూ పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ) మరియు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ కలిగిన స్టిక్కర్లను ఆటోలకు అతికించినట్లు, ఈ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత ఆటో, డ్రైవర్, యజమాని, వాహనానికి సంబంధించిన అధికారిక వివరాలు మరియు ఇతర అవసరమైన సమాచారం అధికారులకు తక్షణమే అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థను ఎస్పీ రూపొందించారని తెలిపారు.ఈ చర్య ద్వారా ప్రయాణికుల భద్రత పెరగడంతో పాటు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ మరియు ప్రజలకు మరింత నమ్మకమైన రవాణా సేవలు అందించడం సాధ్యమయ్యేలా ఎస్పీ ఈ స్టికర్లను రూపొందించారని ఎస్సై తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *