తవణంపల్లి జూన్ 03 మన ద్యాస

పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంఅరగొండ పంచాయతీ ఎంపీటీసీ, ఎక్స్ సర్పంచ్ జి కరీం గత కొన్ని సంవత్సరాలనుండి పెళ్లిళ్లకు 10000 వేల రూపాయలు ఎవరైనా మరణిస్తే 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ వారి కుటుంబంలో ఒక్కరిగా తోడుగా నిలుస్తున్నారు ఈ క్రమంలో నల్లపరెడ్డిపల్లి గ్రామం లో శివప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకుని భౌతిక కాయానికి నివాళులర్పించి,కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారిని ఓదార్చి దహన సంస్కారాలకి 5000 వేల రూపాయలు అందించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు శివప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ కరీం తో పాటు పైమాఘం ప్రశాంత్ కుమార్, పైమాఘం యూత్ సభ్యులు , నల్లపరెడ్డి పల్లి గ్రామ పెద్దలు మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed