తిరుపతి జూన్ 4.
టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రాణరక్షక వైద్యసేవలు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.

తమ మనవరాలు చి. కుప్పాల దర్శన పేరుతో అందించిన ఈ విరాళానికి సంబంధించిన డీడీని తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి గురువారం సమర్పించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఈవో చి. దర్శనను ఆశీర్వదించి, సమాజహితాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఉదారంగా విరాళం అందించిన కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులను అభినందించారు.

టీటీడీ చేపడుతున్న వైద్య, మానవతా సేవలకు భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం మరెందరికో ప్రాణదానంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *