తవణంపల్లి మే 30 మనద్యాస
ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో మనస్థాపం చెంది యువతి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు ఆయన కథనం మేరకు తవణంపల్లి మండలం చారాల చెందిన కావ్య (24) అదే గ్రామానికి చెందిన విక్కీ గత 6 నెలల కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని వ్యక్తి హామీ ఇచ్చాడు. కానీ ఎన్నిసార్లు వివాహ ప్రస్తావన తెచ్చినప్పటికీ ఏదో ఒక కుంటి సాకుతో ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడని, ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9.30 లకు విక్కీని పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీయడంతో, ఆమెను పెళ్లి చేసుకోను అని, తనకు నచ్చినట్లు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని, లేదా చనిపోవాలి అనుకుంటే చనిపోవచ్చునని సమాధానం ఇచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కావ్య జీవితం మీద విరక్తి చెంది ఇంట్లోనే పైకప్పుకు దుప్పటతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు అజయ్, ఇతరులు ఏంటి ప్రధాన తలుపును పగలగొట్టి మృతిరాలిని చికిత్స నిమిత్తం అరగొండ అపోలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటన పైన మృతురాలి తల్లి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.