మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం తల్లిదండ్రులకు భారంగా మారకుండా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా అండగా నిలుస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు కలిసి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆడపడుచుల వివాహాలకు ప్రభుత్వం చేయూతనందిస్తోందని, ఇందుకోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు.సంక్షేమ పాలనతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రతి అర్హులైన కుటుంబం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రజాపండరి, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు సంకు లక్ష్మయ్య,సర్పంచులు బొజ్జ అంజయ్య ,బ్రహ్మం,మోహన్, కేతావత్ నారాయణ,నాయకులు గుర్రపు శ్రీనివాస్,మంద బలరాం ,బంగ్లా ప్రవీణ్ ,అనీస్,తదితరులు ఉన్నారు.