ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, జెండా ఆవిష్కరించిన తుడా ఛైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి

  • తిరుపతి పార్లమెంట్ 5వ క్లస్టర్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక వార్షిక పండుగ ‘మహానాడు’ కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైనది.
  • ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి , తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి పనబాక లక్ష్మి తో కలిసి పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా ముందుగా తుడా చైర్మన్ డా||డాలర్స్ దివాకర్ రెడ్డి , పనబాక లక్ష్మి కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
  • పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
  • ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.
  • బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. ఎప్పటికీ పేదల పక్షానే నిలబడుతుందని స్పష్టం చేశారు.
  • పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కృషిని గడపగడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు.
  • ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా,నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలోని నూతన కార్యవర్గంతో పార్టీ మరింత ముందుకు వెళ్లాలని, భవిష్యత్తులో నూతన విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
  • రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
  • ఈ కార్యక్రమంలో 5వ క్లస్టర్ ఇంఛార్జులు,వివిధ విభాగాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *