మన ధ్యాస నిజాంసాగర్ : జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ,ఎల్లమ్మ బోనాల పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డప్పుల మేళాలు,భక్తి గీతాల మధ్య గ్రామంలో బోనాల ఊరేగింపు వైభవంగా సాగింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మాగి గ్రామ సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *