చిత్తూరు ,మన ధ్యాస,మే 24
రిపోర్టర్ కమల్ రెడ్డి
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కోటూరు గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం పెయింటింగ్ పనులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, పూజా సామగ్రి సమర్పణ కార్యక్రమాలను గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి కుమారులు ఏ. సుధాకర్ రెడ్డి (బాబు), ఏ. దేవరాజుల రెడ్డి (చిట్టి) వారి చేతుల మీదుగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా వేద పండితులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం గ్రామ ప్రజలకు తీర్థప్రసాదాలు అందజేసి గ్రామ శ్రేయస్సు కోసం ఆశీర్వచనాలు చేశారు.అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరాజుల రెడ్డి వారి కుటుంబ సభ్యులు మొత్తం రూ.4 లక్షల 50 వేల విరాళం అందించి సేవాభావాన్ని చాటుకున్నారు.గ్రామస్థులు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించిన దాతలను అభినందించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.