మన ధ్యాస, నెల్లూరు, మే15 : నెల్లూరు నగరం మిని బైపాస్ రోడ్డు, బివినగర్,సప్తగిరి కాలనీ వద్ద అగస్త్య ఆగ్రోస్ అధీకృత సోలిస్ ట్రాక్టర్ డీలర్‌షిప్ నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించ నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్దన్‌ రిడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రెడ్డి పోరూమ్ అధినేత యనమల నాగార్జునరెడ్డి , అమ్మ ఫర్నిచర్స్ అధినేత సుధాకర్‌ రెడ్డి, కంపిని సిబ్బంధి, బంధు మిత్రులు,శ్రేయోభిలాషులు,తదిమితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభిరామి రెడ్డి మాట్లాడుతూ…. వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఆధునిక యంత్రాల వినియోగం ఎంతో అవసరమని పేర్కొన్నారు.రైతులకు నాణ్యమైన ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉండటం ద్వారా వ్యవసాయం మరింత లాభదాయకంగా మారుతుందని తెలిపారు. సోలిస్ ట్రాక్టర్లు రైతుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన పనితీరును అందిస్తాయని ఆయన తెలియజేశారు. నా మిత్రులు వాళ్ళ అబ్బాయి యనమల నాగార్జునరెడ్డి ఈ షోరూమ్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న వల్ల ఇక్కడ రావడం జరిగింది అని అన్నారు. ఈ షోరూం మంచి అభివృద్ధి లోకి రావాలని కోరారు.షోలిస్ కంపెనీ మంచి బ్రాండ్ కంపెనీ కలిగిన కంపెనీ అని తెలియజేశారు. రైతులకు వ్యవసాయానికి,ఇతర పనులకు కంపెనీ ట్రాక్టర్ అనుకూలంగా ఉంటుంది అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *