మన ధ్యాస నిజాంసాగర్ ( జుక్కల్ )
మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో గల 70/ సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న జేసీబీని రెవెన్యూ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు.
ప్రభుత్వ భూమిలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొరం తవ్వకాల కోసం ఉపయోగిస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకుని మహమ్మద్‌నగర్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా మొరం తవ్వి విక్రయిస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు, సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు.ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *