• హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం తిరుమల శేషాచల అడవుల్లో కొలువై ఉన్న అత్యంత పురాతనమైన, మహిమాన్వితమైన శ్రీ జపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
  • ఆలయ ప్రాంగణానికి చేరుకున్న చైర్మన్ కి హథీరాంజీ మఠం మహంత్ అర్జున్ దాస్ జీ మరియు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
  • ఆలయ అర్చకులు శివనారాయణ, వేణుగోపాల్ ఆధ్వర్యంలో చైర్మన్ కి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.
  • దర్శనానంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛారణల తో చైర్మన్ కి ఆశీర్వచనం పలికి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
  • ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:హనుమత్ జన్మస్థలమైన అంజనాద్రి పై వెలసిన జపాలి దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు.
  • హనుమంతుడిని హనుమాన్ జయంతి వేళ భక్తులందరికీ ఆ హనుమంతుడి ఆశీస్సులు లభించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చైర్మన్ ఆకాంక్షించారు.
  • ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, హథీరాంజీ మఠం ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *