గంజాయి సమాచారం కోసం 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయండి…

రేణిగుంట మండలం ఆర్‌టిసి బస్టాండ్ వద్ద సీఐ జయచంద్ర అవగాహన సదస్సు…

రేణిగుంట మే 12.
​తిరుపతి జిల్లా,
రేణిగుంట మండలం పరిధిలోని ఆర్‌టిసి బస్టాండ్ కూడలి వద్ద గంజాయి మరియు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర,ఈగల్ టీం సీఐ ప్రసాద్ జరిగిన ఈ కార్యక్రమంలో ఈగల్ టీమ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ, బస్టాండ్ కూడలిలో ఉన్న ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలకు గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల రవాణా లేదా విక్రయాల గురించి ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే ప్రభుత్వం కేటాయించిన 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును బాగు చేసుకోవాలని, గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీమ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *