మన ధ్యాస నిజాంసాగర్ 🙁 జుక్కల్ )
నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ గుల ఆగమయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరీ ప్రారంభించారు. టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా పండరీ మాట్లాడుతూ ..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. అర్హులైన పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు విడతల వారీగా బిల్లులు విడుదల చేస్తుండటం ఆనందకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, సర్పంచులు అంజయ్య ,పోచయ్య, బ్రహ్మం, మోహన్ ,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *