ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్‌ను ప్రారంభించిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి
తిరుపతి మే 11.
తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడలో సోమవారం ఉదయం వినాయక ఎంటర్ప్రైజెస్ ట్రూజోన్ సోలార్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ హితమైన సౌరశక్తి వినియోగం నేటి కాలంలో ఎంతో అవసరమని పేర్కొన్నారు.
విద్యుత్ పొదుపుతో పాటు స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించడంలో ఇటువంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆకాంక్షించారు.
వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం శుభపరిణామమని, ప్రొప్రైటర్ భరత్ కుమార్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *