మన ధ్యాస, నిజాంసాగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని బాన్సువాడ డీఎల్ పీవో ప్రసాద్ రావు అన్నారు. శుక్రవారం మహమ్మ ద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించారు. ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆయన, గ్రామంలో నిర్మాణం లో ఉన్న పలు ఇళ్లను స్వయంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రావు మాట్లాడుతూ ..అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో శుక్రవారం వాటర్ ఇన్ డే సందర్భంగా మొక్కలకు నీరు పోశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని హరిణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శిరీష తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *