శ్రీకాళహస్తి, మే 6: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం దర్శించుకున్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

​స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వేణు ముదిరాజ్, రేణిగుంట మండల ఉపాధ్యక్షులు రాజారాయల్, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *