• తుడా కార్యాలయంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా అసోసియేషన్‌కు సంబంధించిన పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి, వినతి పత్రం సమర్పించారు.
  • అసోసియేషన్ పరిధిలోని సుమారు 320 మంది సభ్యుల సంక్షేమం, సమావేశాల నిర్వహణ కోసం ఒక కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేయాలని కోరారు.
  • మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా, కొత్తగా వస్తున్న BS-6 (BS VI) వాహనాల రిపేర్ మరియు మెకానిజంపై మెకానిక్కులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ‘స్కిల్ డెవలప్‌మెంట్’ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు.
  • ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:టూ వీలర్ మెకానిక్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
  • సాంకేతిక మార్పుల వల్ల మెకానిక్ లు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పరంగా అవసరమైన శిక్షణ కార్యక్రమాలపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
  • ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్, సెక్రటరీ హరి ప్రసాద్, ట్రెజరర్ సాహెత్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *