స్థానిక సిమ్స్ (SVRR) ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గత కాలంగా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 850 మంది కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

కార్మికుల విన్నపాన్ని సావధానంగా విన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

ఆసుపత్రిలో సేవలందిస్తున్న కార్మికుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *