తమ శెట్టిపల్లి ప్రాంతంలోని భూములకు సంబంధించి సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి కావడంతో ఫ్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమస్యను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించిన తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని కొంతమంది యజమానులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
మా కలల ఇంటి స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సమస్య తీరడం చాలా సంతోషంగా ఉంది.
మా విజ్ఞప్తిని మన్నించి, సామాన్యుల పక్షాన నిలబడిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి మేము రుణపడి ఉంటామని వారు తెలిపారు.



