

మన న్యూస్:నెల్లూరు డిసెంబర్15 వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకగా ప్రారంభమైన మెగా జాబ్ మేళా జ్యోతి ప్రజ్వలన చేసిన వేమిరెడ్డి దంపతులు జాబ్ మేళాలో పాల్గొనేందుకు VPR కన్వెన్షన్ కు వేలాదిగా తరలివచ్చిన యువత.ప్రతి మూడు నెలలకోసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తాం.100 కు పైగా ఐటి మరియు నాన్ ఐటి కంపెనీల భాగస్వామ్యం టాటా కన్సెల్టెన్సీ వారి స్కిల్ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను నిరుద్యోగరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు తెలిపారు.ఆదివారం వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనుపర్తిపాడులోని VPR కన్వెన్షన్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను వేమిరెడ్డి దంపతులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.ఈ జాబ్ మేళాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి వారి విద్యార్హతలు తగ్గ ఉద్యోగం రావాలనికోరుకుంటున్నానన్నారు. మూడు నెలలకు ముందు నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు.ఈ సారి 100 కు పైగా ఐటి, నాన్ ఐటి కంపెనీలు ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్న నేపథ్యంలో మరింత ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు.ఉద్యోగావకాశాలు రాని యువతీ యువకులు నిరుత్సాహ పడొద్దని హితవు పలికారు.జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని, ప్రతి మూడు నెలలకు జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు.అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేసే సామాజిక సేవలో భాగంగా నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.ఈ జాబ్ మేళా ద్వారా యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది కళ్ళలో ఆనందం చూడాలన్నది ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశయమన్నారు.ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశం రాని వారెవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. టాటా కన్సెల్టెన్సీ వారు తమ స్కిల్ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారని,వారి సూచనలు పాటించి మరో మూడు నెలల తరువాత నిర్వహించే జాబ్ మేళాలో అవకాశాలు దక్కించుకోవచ్చన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి,ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఏర్పాట్లను పరిశీలించి జాబ్ మేళాకు వచ్చిన యువతతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తనయులు అర్జున్ రెడ్డి,నీలిమా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణ నాయుడు,నెల్లూరు డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్,బుచ్చిరెడ్డి పాళెం మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, తెలుగుదేశం నాయకులు బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి,కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
