మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం రఘునాధపాలెం అడవుల్లో పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పులి సంచారంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు, గిరిజనులు భయపడుతున్నారు. పులి పెద్ద పెద్ద అరుపులు అరుస్తుందని, అది అడవిలో ఉందని, అటువైపు వెళ్లాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు. పెద్దపులి సంచారంతో పశువులు సైతం దొడ్ల కి పరిమితం అవుతున్నాయని సమాచారం. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులిజాడ కోసం ముమ్మరంగా కరకగూడెం అడవుల్లో గాలిస్తున్నారు. పెద్దపులిని గుర్తించకపోయినా పులి పాదముద్రలు మాత్రమే అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అధికారులు అడవుల్లోనే ఉండి పులి కోసం మమరంగ గాలింపు చర్యలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *