మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి పాపేశ్వర ఆలయం నుండి నల్లగుట్ట తాండ వరకు షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ నిధులు 1 కోటి 6 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి చేయడమే లక్ష్యం అని అన్నారు.అనంతరం నిజాంసాగర్ మండలంలోని వడ్డే పల్లి రైతు వేదికలో అన్ని గ్రామాలకు చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.అనంతరం అచ్చంపేట్ గ్రామంలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్యం కాంతారావు టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుల ముఖాల్లో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికా ర్జున్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ న్ చీకోటి మనోజ్ కుమార్, నాయకులు గుర్రపు శ్రీనివాస్, అజయ్ రెడ్డి, ప్రజా పండరి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంకు లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు బొజ్జ అంజయ్య, కేతావత్ నారాయణ,సాతేలి పోచయ్య, తహసిల్దార్ సాయి భుజంగరావు ,రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు, గ్రామ కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *