మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో గురువారం ప్రొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు మద్దతుగా క్వింటాలుకు రూ. 7,721/- కనీస మద్దతు ధర (MSP) నిర్ణయించిందని తెలిపారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకువచ్చి అమ్ముకోవాలని సూచించారు.రైతులకు న్యాయమైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వారు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు పారదర్శకంగా, త్వరితగతిన చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ కోనగల శంకర్ , డైరెక్టర్లు శివసేట్, మున్సిపల్ కౌన్సిలర్లు దర్పల్ గంగాధర్, నౌషా నాయక్, ముజహైద్, సందని,నాయకులు విఠల్ రెడ్డి,దడిగి నాగనాథ్,వెంకట్ రెడ్డి, గోపాలరెడ్డి, ఏఎంసి సెక్రటరీ రాజకుమార్,సంఘ సీఈఓ శ్రావణ్ కుమార్ ఏవో అమర్ ప్రసాద్, నాయకులు భాస్కర్ రెడ్డి, ప్రేమ్ సెట్ తదితరులు పాల్గొన్నారు.