మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే విధంగా సర్పంచులు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. సర్పంచులు తమ గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా,ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, సర్పంచులు లక్ష్మయ్య ,బొజ్జ అంజయ్య, పోచయ్య, వడ్ల బ్రహ్మం,కేతావత్ నారాయణ,నాయకులు గుర్రపు శ్రీనివాస్,అజయ్ రెడ్డి,తదితరులు ఉన్నారు.