కలిగిరి, ఏప్రిల్ 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

గురువారం కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఆ పాఠశాల క్లస్టర్ ప్రధానోపాధ్యాయనీయురాలు శ్రీమతి V వి వెంకటలక్ష్మీశ్రీ ఆధ్వర్యంలో “మన బడి – జ్ఞానబాట” – తొలి అడుగు…. మన ప్రభుత్వబడిలో…! అనే కార్యక్రమంలో భాగముగా కలిగిరి పట్టణంలో భారీ ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కలిగిరి మండల విద్యాశాఖాధికారి గోళ్ళ సురేష్ పాల్గొని ఈ సంవత్సరం కలిగిరి మండలంలో బడిబయట ఉన్న విద్యార్థినీ విద్యార్థులు అందరూ ఖచ్చితంగా పాఠశాలలలో వందశాతం జాయిన్ చేయించేలా కార్యాచరణను రూపొందించి అన్నీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులకు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ కు దిశా నిర్దేశం చేశారు. అదేవిదంగా ఆయా గ్రామాలలో ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను, పూర్వ విద్యార్థులు మరియు గ్రామాలలోని స్వచ్ఛంద కార్యకర్తల సహాయ సహకారం తీసుకొని ఈ కార్యక్రమంను విజయవంతం చేసేలా చూడాలని అభిలాషించారు.ఈకార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు మరియు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *