బంగారుపాళ్యం,మన ధ్యాస, ఏప్రిల్12,

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం 170 గొల్లపల్లి పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ కోకా ప్రకాష్ నాయుడు 59వ జన్మదిన వేడుకలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్,టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మొదటగా గ్రామంలోని వినాయకుని ఆలయం,సత్యమ్మ ఆలయం, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన స్థలంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు.అనంతరం అందరూ కోకా ప్రకాష్ నాయుడు ను సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ బంగారుపాళ్యం మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ పోరాటాలు చేస్తున్న కోకా ప్రకాష్ నాయుడుకి జిల్లా సర్పంచుల సంఘంలో గౌరవం దక్కడం ఎంతో సంతోషదాయకంగా ఉందని ఆయన తెలిపారు.కోకా ప్రకాష్ నాయుడు తన సొంత గ్రామంలో స్థానిక ప్రజలు మండలంలోని టిడిపి కార్యకర్తలు, ఎంపీటీసీలు సర్పంచుల ఆధ్వర్యంలో ఘనంగా తన పుట్టినరోజు జరుపుకోవడం పట్ల స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మండలం అధ్యక్షుడు ఎన్ పి జయప్రకాశ్ నాయుడు,ధరణి,ఎన్.పి.విక్రమ్,చిత్తూరు జిల్లా టిడిపి మాజీ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్,జనార్దన్ గౌడ్,రమణ చల్ల గుండ్ల,తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ నాయుడు,సుధాకర్ నాయుడు,నేతాజీ నాయుడు,వాసుదేవ నాయుడు,ఎన్.పి.రాధాకృష్ణ, కోకా హరి,కోకా కేశవ,అశోక్,చిన్న, కార్యకర్తలు,ఎంపీటీసీలు,సర్పంచులు,మహిళలు,పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *