Oplus_0

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్):మహమ్మద్ నగర్ మండల సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని గురువారం మండల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గున్కుల్ గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్‌ను ఎన్నుకున్నారు,ఉపాధ్యక్షుడిగా సింగీతం గ్రామ సర్పంచ్ సయ్యద్ రఫీ, ప్రధాన కార్యదర్శిగా గొట్టం అనసూయ, కార్యదర్శిగా కుమ్మరి రాములను ఎంపిక చేసినట్లు సర్పంచులు తెలిపారు.ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు బోయిని హరిన్ కుమార్,గజ్జల జీవన్,కిరణ్,నాయకులు నాగభూషణం గౌడ్, సవాయి సింగ్, నగేష్ తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *