మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో మత్తడి పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు.కుస్తీ పోటీలను ఆసక్తిగా తిలకించేందుకు మహారాష్ట్ర కర్ణాటక, నారాయణఖేడ్ జహీరాబాద్,తదితర ప్రాంతాల నుంచిఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్న మల్లయోధులు తమ ప్రతిభను చాటుకున్నారు.గ్రామంలో జరిగిన ఈ కుస్తీ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.
గెలుపొందిన మల్లయోధులకు గ్రామ సర్పంచ్ గజ్జల జీవన్, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, విఠల్ రెడ్డి లు కలిసి నగదు అందజేశారు. పోటీలు రూ.300, రూ.500, రూ.1000 నగదు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాములు, మనీష్ రెడ్డి, భూమయ్య, పెంటయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *