వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్,కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.15 వేల ఆర్థిక సహాయం.స్థానిక టీడీపీ నాయకుల అండ: రూ.5 వేల నగదు, 100 కేజీల బియ్యం అందజేత.

జలదంకి, మార్చి 17,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె.

జలదంకి మండలం, జమ్మలపాలెం ఎస్టీ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన చలంచర్ల రమేష్ అకస్మిక మరణం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర సంఘటనను స్థానిక నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి తన మనవత్వాన్ని చాటుకున్నారు.బాధిత కుటుంబ పరిస్థితిని గుర్తించి, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.15 వేల రూపాయలను మండల నాయకులు మరియు స్థానిక నాయకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు.అదేవిధంగా, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సింగమనేని మనోజ్ కుమార్ యాదవ్ షేక్.ఖాజావలి కలసి తమ వంతు సహాయంగా రూ.5,000/- నగదు మరియు 100 కిలోల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులను పరామర్శించి,ఈ కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తిరుమల రెడ్డి, సోమశిల వైస్ ప్రెసిడెంట్ మధుమోహన్ రెడ్డి, సింగమనేని మనోజ్ కుమార్, సర్పంచ్ బుర్రి శ్రీవేణి, నక్క మాధవరావు, షేక్ ఖాజావలి, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *