కలిగిరి,మార్చి 15,మన న్యూస్ ప్రతినిధి, ( నాగరాజు కె).
కలిగిరి మండలం లో సోమవారం నుండీ 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థిని విద్యార్థులకు, విద్యావంతులు, అభివృద్ధి ప్రదాత ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశానుసారం కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసల వెంగపనాయుడు ఆల్ ది బెస్ట్ తెలిపారు. కలిగిరి మండలం లో రెండు పరీక్ష కేంద్రాలు, లలో ఉదయం 9:30 నుండీ 12:45 వరకు పదివతరగతి విద్యార్థి ని విద్యార్థులు కు పరీక్షలు నిర్వహిస్తున్న సమయం లో వేసవి కాలం దృష్ట్యా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నీ సదుపాయాలు తో పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆయన కోరేరు. పరీక్షలు రాసే సమయం లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లకు లోను కాకుండా పరీక్షలు రాయాలన్నారు. పరీక్ష సమయానికి 45 నిముషాలు ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలన్నారు. ప్రతి విద్యార్థి అంకితభావంతో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఉన్నత చదువులు చదవాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఇంటి వద్ద నుంచి ముందుగానే బయలుదేరి పరీక్షా కేంద్రలకు చేరుకోవాలి అని ఆయన తెలియజేసారు.