దేవాదాయ శాఖ సహకారంతో జిర్రావారిపాలెంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం..కోదండ రామస్వామి వారి ఆలయ నిర్మాణానికి రూ.1 కోటి మంజూరు – ఎమ్మెల్యే కాకర్ల సురేష్…
కలిగిరి మార్చి 8, మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ).

కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి స్వామివారి నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.ఈ పవిత్ర కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, జిర్రావారిపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన ఆలయ నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు.ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ప్రభుత్వం ద్వారా రూ.1 కోటి రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, స్థానిక నాయకులు మరియు పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
