విజయవాడ, మార్చి 07,మన న్యూస్ (నాగరాజు కె )
విజయవాడలోని ఆంధ్ర లూక్స్ కన్వెన్షన్లో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జరిగిన క్రీడా పోటీల్లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ జట్టు ఫస్ట్ ప్రైజ్ సాధించడం విశేషం.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , మంత్రి నారా లోకేష్ , ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఇలాంటి కార్యక్రమాలు పరస్పర స్నేహభావాన్ని పెంపొందించడమే కాకుండా, మరింత ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేయడానికి ప్రేరణనిస్తాయని తెలిపారు.
