

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా ఉప్పసాక గ్రామం ప్రధాన రహదారి పక్కన అని పిడి కుమార్ అనే రైతు సాగు చేస్తున్నటువంటి మునగ తోటను స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నారై ఈజీఎస్ ద్వారా ప్రభుత్వం ములకతోటకు సబ్సిడీ ఒక ఎకరాకు లక్ష ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు మొక్కలు, గుంటలు తీసి, నాటిన తర్వాత దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఎరువులు ప్రభుత్వం ద్వారా పొందవచ్చునని ఆయన అన్నారు. వరి పత్తి వివిధ పంటల కంటే మునగ తోట ద్వారా రైతు ఆర్థికంగా ముందంజలో ఉంటాడని ప్రభుత్వం గుర్తించి ఈ పంటని ఎక్కువ శాతం పండించే విధంగా వ్యవసాయక శాఖ అధికారులు ప్రతి మండలంలో విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బూర్గంపాడు మండల నాయకులు,యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.