పుష్పగుచ్చం అందజేసినా కలిగిరి మండల కన్వీనర్ పూసల వెంగప నాయుడు..

అమరావతి, ఫిబ్రవరి 26,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ).

ఉదయగిరి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన కలిగిరి టిడిపి మండల కన్వీనర్ పూసల వెంగపనాయుడు,అమరావతి లోని అతిథి గృహమునందు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి మండల బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాపై ఉంచిన ఈ గురుతుర బాధ్యతను వమ్ము చేయక, బాధ్యతగా నడుచుకొని తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు పార్టీకి వారధిగా నిలచి పార్టీ పట్టిష్టకు కృషి చేస్తామన్నారు.ఈ బాధ్యతను పదవిగా కాకుండా, సేవకుడిగా భావించి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామన్నారు. మాకు పదవి వచ్చేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ కి,టిడిపి పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీ, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.నియోజకవర్గంలోని నాయకులకు, ప్రజానీకానికి కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *