యాజమాన్యం పట్టి పట్టనట్టు ఉన్నారు అని, దీని పై తగు చర్యలు తీసుకొని ఈ పెట్రోల్ బంకును చీజ్ చేయాలని వాహనదారులు వాపోతున్నారు.
కలిగిరి, ఫిబ్రవరి 18,(మన న్యూస్ ప్రతినిధి), నాగరాజు కె.

నెల్లూరు జిల్లా కలిగిరి లోనీ భారత్ పెట్రోల్ బంకులో డీజిల్ కల్తీ కలకలం రేగింది. పట్టణంలోని శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ పెట్రోల్ బంకులో డీజిల్ లో నీరు, శుద్ధ కలవడంతో వాహనాలన్నీ అక్కడికక్కడే ఆగిపోయాయి. ఐదు ఆటోలు, రెండు ట్రాక్టర్లు కల్తీ డీజిల్ కలవడం తో అక్కడే నిలిచిపోయాయి వాహన దారులు వాపోతున్నారు. దీంతో వాహనదారులు పెట్రోల్ బంక్ ఎదుట ఆందోళనకు దిగారు. పెట్రోల్ బంక్ ఎదురుగా వాహనాలను నిలిపి నిరసన చేపట్టారు. మరోవైపు ఇంత జరుగుతున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పెట్రోల్ బంకుల వలన వాహనాలు ఇంజన్లు దెబ్బతింటాయని,వాహనదారులు దివాలెత్తుతామణి పెట్రోల్ బంక్ ను సీజ్ చేయాలంటూ బొంకు ఎదుట,వాహనదారులు నిరసన చేపట్టారు
