
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ).కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి.. 12 మంది కౌన్సిలర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు.ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఘన స్వాగతం పలికారు.ముందుగా మంత్రి అజారుద్దీన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తల నడుమ భారీ కేట్ కట్ చేయించి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు,మహిళలు బిచ్కుంద ప్రజలతో కలిసి భారీ రోడ్ షో గా వెళ్తూ నాయకులు ప్రజలకు అభివాదం చేస్తూ బిచ్కుంద బస్టాండ్ కు చేరుకొని అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ కార్నర్ మీటింగ్‌లో మంత్రి అజారుద్దీన్ ప్రసంగిస్తూ.. బిచ్కుంద మున్సిపాలిటీలో 12 కు 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందేనని, ఆదిశగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని స్పష్టమైన పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఉన్నత విద్యా వంతుడు, జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికై పట్టుదలతో,గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడని.ప్రజలందరూ ఆయన వెంట నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజలకు మహిళ ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసిందని, గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి గడపగడపకు అందుతుందని అన్నారు.బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడి 12 మంది కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..మీటింగ్ కు భారీ సంఖ్యలో తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు..
భారీ జన స్పందనను చూసి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖరారు అయిందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.మొత్తం 12 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్దే ధ్యేయంగా మేము ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుపడడానికి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహానికి గురయ్యారు.నిన్న బిచ్కుందకు ప్రచారానికి వచ్చిన కేటీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బిచ్కుంద మున్సిపాలిటీని రద్దు చేస్తామని చెప్పడమే దీనికి నిదర్శనం అని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చి బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని,వార్డులలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని మేము కృషి చేస్తుంటే.బిచ్కుంద కానీ జుక్కల్ నియోజకవర్గం గానీ అభివృద్ధి చెందడం ఏ మాత్రం ఇష్టం లేని బీఆర్ఎస్ నాయకులు ఇలా ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.ఎవరెన్ని కుట్రలు చేసినా బిచ్కుందను ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తానని ఎమ్మెల్యే వాగ్దానం చేశారు.ఈ మోసగాళ్ల మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ప్రజలకు వీళ్ల అవినీతి చరిత్ర అంతా తెలుసని అన్నారు..
గత ఎన్నికల ఫలితాలే వాటికి నిదర్శనమని చెప్పారు.కాబట్టి ప్రజలందరూ అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించండి.బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా అని సభా ముఖంగా ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, 12 మంది కౌన్సిలర్ అభ్యర్థులు
గోనె హన్మవ్వ గంగరాం,బాబల్గాం చిన్న మారుతి,దర్పల్ కార్తిక సంతోశ్ ,బుర్రెవార్ సునిత సాయిరాం ముదిరాజ్,వందన హన్మంత్,నౌష్య నాయక్,మొహమద్ ముజాహిద్
,షేక్ గులాం సంధాని,దర్పల్ గంగాధర్,మఠం మానస,భాగ్య లక్ష్మి ప్రేం సేట్,సీమా రమేశ్ షెట్కార్,నాయకులు సాయి పటేల్,సాహెల్ షట్కర్,తదితరులు ఉన్నారు
