బంగారు పాల్యం, మనధ్యాస ,ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి
చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి మాజీ డైరెక్టర్, అలాగే కర్ణాటక–కేరళ రాష్ట్రాల నారాయణ గురు ధర్మ ప్రచారణ యువజనసభ చైర్మన్గా ఉన్న గౌరవనీయులు కే. గోపి ని బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎ.పి. రాష్ట్ర గౌడ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుసా నాగరాజ గౌడ్, చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సంఘం యువసేన ప్రధాన కార్యదర్శి లేబాకుల మురళి గౌడ్, కర్ణాటక రాష్ట్ర ఓబిసి వైస్ ప్రెసిడెంట్ అట్లారి వేణుగోపాల్ గౌడ్, బెంగళూరు ఆర్.ఆర్. నగర్ బ్రహ్మర్షి నారాయణ గురు ఆర్య ఈడిగ సేవా సంఘం అధ్యక్షులు వెంకటేశప్ప, ప్రధాన కార్యదర్శి యువరాజ్, ఉపాధ్యక్షుడు అట్లూరి జీవా, కోటపాటి రమేష్, లేబాకుల కన్నయ్య, కలిమిడి సుబ్బా తదితరులు పాల్గొన్నారు.సన్మానం అనంతరం నాయకులు గోపి సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు.