మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సీఎం కప్ ఆట పోటీలను మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,ఎంపీడీవోలు సత్యనారాయణ రెడ్డి,తహసీల్దార్ లత,ఎంపీవో అనిత లు కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు…గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభకు అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు క్రీడలను కేవలం పోటీలుగా కాకుండా, ఆరోగ్యకరమైన జీవన విధానంగా అలవాటు చేసుకోవాలనిసూచించారు.క్రీడల ద్వారా క్రమశిక్షణ,సహనం,జట్టుభావనపెంపొందుతాయని,గ్రామ పంచాయతీ తరఫున క్రీడా సౌకర్యాల మెరుగుదలకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.విద్యతో పాటు క్రీడలు సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని,క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.క్లస్టర్ స్థాయిలో ప్రతిభ కనబర్చిన మండల జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు బోయిని హరిన్ కుమార్,కుమ్మరి రాములు,రఫీ,జీవన్,కిరణ్,నాయకులు కాశయ్య,ఆకాష్, గొట్టం నర్సింలు,తదితరులు ఉన్నారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *