కలిగిరి, మనధ్యాస, జనవరి 28,(నాగరాజు కె )

కలిగిరి మండలం పెద్ద కొండూరు పంచాయతీలోని పెద్దపాడు లో పెరుగుతున్న మామిడి తోటల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పెద్ద కొండూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 650లో సుమారు 4.5 ఎకరాలు విస్తీర్ణంలో ఇటీవల కాలంలో గ్రామపంచాయతీ తరుపున మామిడి మొక్కల పెంపకం సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా పరిశీలించిన కలెక్టర్ భవిష్యత్తులో వీటిని ఏమి చేయాలని ఆలోచన ఉంది అని ప్రశ్నించగా గ్రామపంచాయతీ ప్రజల అదృష్టం మేరకే నడుచుకుంటామని సర్పంచ్ మొక్క సుజాత తెలిపారు.ప్రజాలు కోసమే పనిచేస్తామని, ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వాళ్ళతో కలిసి ఉంటానని ఆమె తెలిపింది.ఈ మాటల విన్న కలెక్టర్ సర్పంచ్ మొక్క సుజాతను సంబంధిత అధికారులను ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి పనిచేస్తున్నందుకు వారిని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఓ శ్రీధర్ రెడ్డి, ఆర్డిఓ వంశీకృష్ణ, డిపిఓ వసుమతి, ఎండిఓ ప్రత్యూష, తాసిల్దార్ (ఇంచార్జ్)గిరీష్, మండల సర్వేర్ తో పాటు నాయకులు రైతులు మాజీ సర్పంచ్ మొక్కా హజరత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *