మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బోయిని హరిన్ కుమార్, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డి లు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు డాన్స్ చేశారు,అనంతరం ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్పంచ్ బోయిని హరిన్ కుమార్,ఉప్ప సర్పంచ్ గంగారం, ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో జిపిఓ వినోద్,నాయకులు పెద్ద పట్లోల లక్ష్మీకాంత్ రెడ్డి,మంగలి చిన్న రాములు,వెంకట్ రాములు, వెంక గౌడ్,వార్డు సభ్యులు మొహమ్మద్ షరీఫ్,ఉపాధ్యాయులు గణేష్, సుధారాణి,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *