77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ బంగ్లాలో తేనేటి విందు.ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయానికి నిదర్శనంగా వేడుక.
నెల్లూరు జనవరి 26, మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె).
నెల్లూరు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఐఏఎస్ ఘనంగా ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమం శోభాయమానం గా జరిగింది.ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేశారు.దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రతీక అయిన గణతంత్ర దినోత్సవాన్ని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఐక్యంగా జరుపుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.