

మన న్యూస్:నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో గల హెడ్స్ లుస్ జలవిద్యుత్ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన కాలువ నీటిని విడుదల చేయడానికి విచ్చేసిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి హసన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిని హరిన్ కుమార్, గ్రామ అధ్యక్షులు నిఖిల్,విఎస్ ఏఎస్ చైర్మన్ మంగలి రాములు, ఉపాధ్యక్షులు దుర్గయ్య లు కలిసి శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. నీటి విడుదల చేయడానికి వచ్చిన మంత్రికి సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.