మర్రిపాడు, మన న్యూస్, జనవరి 24,(నాగరాజు కె ).

జనవరి 26 సోమవారం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి లోని మేకపాటి నివాసంలో ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి,యువ నేత మేకపాటి అభినవ్ రెడ్డి అధ్యక్షతన జరుగును.ఈ సమావేశంలో జగనన్న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ స్థాయి నుండి కమిటీల ఏర్పాటు కార్యక్రమం గురించి చర్చించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ సభ్యులు తిరుపతి ఎంపి మద్దెల గురుమూర్తి గారు, జిల్లా పార్టీ పరిశీలకులు జంకే వెంకట రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి , మాజీ ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇతర జిల్లా ముఖ్య నాయకులు పాల్గొంటారు.. కావున నియోజకవర్గం లోని 8 మండలాల లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, మండల పార్టీ కన్వినర్ లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి అన్ని అనుభంద విభాగాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరేరు.…


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *