మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాంగ్రెస్ పాలనలోనే పేదలు,రైతులు, మహిళలు,యువతకు నిజమైన న్యాయం జరుగుతుందనీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.గురువారం మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు డాక్టర్ శ్రీకాంత్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతు రుణమాఫీ,సంక్షేమ పథకాలు, విద్య-వైద్య రంగాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోంది అన్నారు.
ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని పరిష్కరించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ప్రజలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,గాలిపూర్ సర్పంచ్ కిరణ్, గాలిపూర్ గ్రామ అధ్యక్షులు హన్మంలు, తదితరులు ఉన్నారు.