మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో శ్రీహనుమాన్ మందిరం ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరయ్యారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఆలయ పరిపాలన సక్రమంగా నిర్వహించే విధంగా కమిటీ సభ్యులకు అవసరమైన సలహాలు,సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాయి పటేల్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు సాయిలు,మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్,వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, ఆలయ చైర్మన్ విఠల్,ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్స్పెక్టర్ కమలబాయి,సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్, ఇతర అధికారులు,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *