మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని బిచ్కుంద ఎస్ ఐ రాజు అన్నారు.బిచ్కుంద మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత విషయాలు రోడ్డు సేఫ్టీ తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏస్ ఐ మాట్లాడుతూ.. బైక్ నడిపే వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్,ధ్రువ పత్రాలు వెంట ఉండాలని అన్నారు.రోడ్డు భద్రత నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిస్తామని విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులుకు ఏస్ ఏ కాంపిటీషన్ పరిక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్,పోలీస్ సిబ్బంది మురళీ తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *