చిత్తూరు, మన ధ్యాస, జనవరి 10 రిపోర్టర్ :కమల్ రెడ్డి

తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని తల్లిదండ్రుల మాల ధరించిన కొడుకులుఅమ్మ నాన్న లు లేనిదే ఈ సృష్టి లేదని అటువంటి తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల మాల ధరిస్తామని చిత్తూరు నగరం శంకరాయ కుంట చెందిన ఎస్. ఆర్. బి. ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా అమ్మ నాన్నకు మేము 10 మంది సంతానం అందులో నేను 6 వ సంతానమ ని ఆ రోజుల్లో మా అమ్మ నాన్న కష్టపరిస్థితి లో ఉన్న మమ్మల్ని పెంచి పెద్దచేశారని, అప్పట్లో మాకు అంత ఆలోచనలేదని ఇప్పటి సమాజంలో ఒకరు లేక ఇద్దరు పిల్లలతో తల్లి తండ్రులు నానా ఆర్బాటంతో అప్పుచేసి తిప్పలుపడి, కాలాన్ని అతికష్టం మీద నెట్టుకొస్తున్నారన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల పట్ల చాలామంది పిల్లలు నిర్లక్ష్యం వహిస్తూ వయస్సు మల్లిన తల్లిదండ్రులను వృద్దాశ్రమంలో లేక అనాదాశ్రమంలో వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరమన్నారు. తల్లిదండ్రులను, గురువును పూజించినవారికి దైవం ఎప్పుడు తోడు ఉంటుందని మన పురాణంలో ఉన్నదని మన పూర్వీకులు తెలియజేశారన్నారు. ఇది చూసి చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ మాల చనిపోయిన వారి కోసమే కాకుండా బ్రతికి వున్న వారి కోసం కూడా ధరించి అమ్మా నాన్నలకు సేవ చేయాలని కోరారు. దీంతో కనీసం పది మంది మారినా నా ఆశయం ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతికి పెద్దలకు బట్టలు పెట్టడం మన సమాజంలో జరుగుతున్న సాంప్రదాయమని ఈ పనిని వారు బ్రతికి వున్నప్పుడు ఎందుకు చేయకూడదని అనిపిస్తుంది. అందుకే ఈ మంచి కార్యక్రమం చేపట్టాననిఈ ధనుర్మాసంలో సంక్రాంతికి 9 వ,రోజు వచ్చే లాగా చూసుకుని ప్రతి రోజూ అమ్మ నాన్న ఎక్కడ యున్నను వారికి మేలుకలగాలని, వారి సేవకోసం అమ్మ నాన్న మాల వేస్తున్నానని ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మ నాన్న చిత్రపటానికి పాద పూజ చేసి వీలైనంత గుడులను చుట్టి వారు ఎక్కడున్నా మేలు కలగాలని దేవుణ్ణి కోరుకుంటూ, వారికోసం తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి సంక్రాంతి పెద్దపండుగ రోజు వారికి బట్టలు పెట్టి పూజలుచేసి అమ్మ నాన్న మాల వారి ఫోటో వద్ద యుంచి విరమిస్తానని తర్వాత ఈ మాల ధారణం రాబోయే తరాల వారికి తల్లి, తండ్రి పట్ల ప్రేమ భాద్యత పెరుగుతాయని విశ్వచించుచున్నానట్లు తెలిపారు. ప్రస్తుతం గోవింద మాల, అయ్యప్ప మాల, ఓం శక్తి మాలు వేస్తున్నారని అలానే తల్లిదండ్రుల మాల వేసి సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలని నా ప్రయత్నం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *