వరికుంటపాడు, జనవరి 03,మన న్యూస్,(నాగరాజు కె).

వరికుంటపాడు మండల పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి శలువతో టిడిపి మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు, సొసైటీ అధ్యక్షులు గుర్రం గోపి, క్లస్టర్ ఇంచార్జ్ పోకా మహేష్, తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల వైస్ ఎంపీపీ దేవనబోయిన మధు, యూనిట్ ఇన్చార్జి నాదెండ్ల రాజేంద్ర, గ్రామ పార్టీ అధ్యక్షులు పొద మాధవరావు, నాయకులు ఆరికొండ వెంకటరత్నం, వెంగళరావు, వీఆర్వో సంధిరెడ్డి లక్ష్మీనారాయణ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఘన స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు సజావుగా సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని ఆ అంకాలమ్మ తల్లిని ప్రార్థించామన్నారు. అదేవిధంగా వర్షాలు సకాలంలో పడి రైతులు పాడి పంటలతో సుఖశాంతులతో తులతూగాలని ఆ తల్లిని కోరమని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *